సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ కూడలి సమీపంలో కరూర్ వైశ్యా బ్యాంక్ ఏటీఎంలో ఓ వ్యక్తి స్పానర్ల సాయంతో ఏటీఎంను తెరిచే యత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వ్యక్తి పరారయ్యేందుకు యత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఏటీఎం చోరీకి యత్నం.. పోలీసులకు అడ్డంగా దొరికిన వైనం - ఏటీఎం చోరీకి యత్నం
మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏటీఎం తెరిచి నగదు దొంగిలించే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకుని అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో చోటుచేసుకుంది.
మద్యం మత్తులో ఏటీఎం చోరీకి యత్నం..పోలీసులకు అడ్డంగా దొరికిన వైనం
నిందితుడు తెల్లపాడు మున్సిపాలిటీ పరిధి ఈదుల నాగులపల్లి గ్రామానికి చెందిన మహిపాల్గా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: గవర్నర్తో సీఎం కేసీఆర్ సుధీర్ఘ భేటీ..
Last Updated : Jan 2, 2020, 7:31 AM IST