తెలంగాణ

telangana

ETV Bharat / state

జగన్​ అభిమానిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు - undefined

ఏపీ సీఎం జగన్​ను కలవటానికి తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నుంచి కాలినడకన అమరావతి వెళ్లిన యువకుడు కిశోర్​ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు.

jagan fan arrest
jagan fan arrest

By

Published : Jul 14, 2021, 5:32 PM IST

ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్​ఆర్​సీపీ అధినేత జగన్​మోహన్​రెడ్డిపై ఎనలేని అభిమానం పెంచుకున్నాడు తెలంగాణకు చెందిన యువకుడు. జగన్​ అంటే తనకు ఎంతో అభిమానం అంటున్నాడు సంగారెడ్డి జిల్లా కంది వాసి కిశోర్.

జగన్​పై అభిమానంతో ఎలాగైనా ఒక్కసారి కలవాలనే తలంపుతో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​రెడ్డి జయంతి రోజున అమరావతికి పాదయాత్రగా బయల్దేరాడు. ఎలాగోలా తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నాడు. అయితే ఏపీ పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి తరలించారు.

జగన్​ను కలవనిదే తిరిగి వెళ్లేది లేదంటున్నాడు కిశోర్. దారి ఖర్చులకు సరిపోక తన ఫోన్​ కూడా అమ్మేశాడట. తనకు ఏ కోరికలు లేవని, జగన్​ను ఒక్కసారి కలిస్తే చాలని అంటున్నాడు.

ఇదీ చదవండి:ఉద్యోగులకు డీఏ పెంపు- జులై నుంచే అమలు!

For All Latest Updates

TAGGED:

fan

ABOUT THE AUTHOR

...view details