తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నపూర్ణ కార్యక్రమం ముగింపు నేపథ్యంలో అన్నదానం - సాయిరమాదేవి, జిల్లా న్యాయమూర్తి

సంగారెడ్డిలోని కోర్టు ఆవరణలో గత 41 రోజులుగా వలస కార్మికులకు, హైదరాబాద్ నుంచి సంగారెడ్డి మీదుగా స్వగ్రామాలకు వెళ్లే వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారికి పోలీసుల సహకారంతో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి వారి స్వగ్రామాలకు తరలించారు.

అన్నపూర్ణ కార్యక్రమం ముగింపు నేపథ్యంలో అన్నదానం
అన్నపూర్ణ కార్యక్రమం ముగింపు నేపథ్యంలో అన్నదానం

By

Published : May 8, 2020, 12:04 AM IST

కరోనా వ్యాప్తి కొద్దిగా తగ్గిన నేపథ్యంలో జిల్లాలో పేదలకు అన్నప్రసాదం కోసం చేపట్టిన అన్నపూర్ణ కార్యక్రమానికి ముగింపు పలికారు. కరోనా కష్ట కాలంలో అన్నపూర్ణ దేవిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు జిల్లా న్యాయమూర్తికి కలెక్టర్ హనుమంతరావు అభినందనలు తెలియజేశారు. వలస కూలీలు సంగారెడ్డి వెళ్తే చాలు స్వగ్రామలకు చేర్చుతారనే నమ్మకంతో సంగారెడ్డి చేరుకున్నారని జిల్లా న్యాయమూర్తి సాయిరమాదేవి పేర్కొన్నారు. కరోనాపై యుద్ధం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details