తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం - Sri sathya sai Seva Samiti

లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు, వలస కార్మికులకు పలువురు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

annadanam Under the Sri sathya sai Seva Samiti in sangareddy
శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం

By

Published : May 4, 2020, 4:46 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో గత 10 రోజులుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రోజుకు 300 మంది వలస కార్మికులు, పేదలకు అన్నదానం చేస్తున్నారు.

కరోనా వ్యాప్తితో ఇబ్బందులు పడుతున్న పేదలకు, కార్మికులకు శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యం అన్నదానం చేస్తున్నట్లు సమితి నిర్వాహకులు పేర్కొన్నారు. వారానికి 2 రోజులు అమృత కలశం పేరుతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

సమితి ఆధ్వర్యంలో ప్రజల ఇబ్బందులకు అనుగుణంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ మహమ్మారి మనల్ని వదలిపోవాలని రోజూ ఆ భగవంతుడిని వేడుకుంటున్నామని అన్నారు. దాతలు ముందుకు వచ్చి పేదవారికి సాయం చేయాలని.. అలా చేస్తే వారిపై భగవంతుని కృప ఉంటుందని తెలిపారు.

ఇవీ చూడండి:భద్రాద్రిలో మంటలు.. భయాందోళనలో ప్రజలు

ABOUT THE AUTHOR

...view details