సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వెదిరి టౌన్షిప్లో మారుతి బాలికల అనాధ ఆశ్రమంలో 14ఏళ్ల బాలికపై లైంగికదాడి కేసులో పటాన్చెరు డీఎస్పీ రాజేశ్వరరావు ఈటీవీ భారత్ ప్రతినిధి రాజు నిర్వహించిన ముఖాముఖిలో వెల్లడించిన విషయాలు.
1. మైనర్ బాలికపై లైంగిక దాడి ఎలా బయటకు వచ్చింది తరువాత పరిణామాలు ఏం జరిగాయి?
స: జూలై 31వ తేదీన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదైంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మారుతి బాలికల అనాధ ఆశ్రమంలో 14ఏళ్ల బాలికపై వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి దాత ముసుగులో వచ్చి, విజయ, జయదీప్ అనే నిర్వాహకులతో పరిచయం పెంచుకున్నాడు. బాలికను వేణుగోపాల్ రెడ్డితో కలిసి 5వ అంతస్తుకి వెళ్ళమని నిర్వాహకులు చెప్పారు. అనంతరం శీతలపానీయంలో మత్తుమందిచ్చి ఆ బాలిక అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత అత్యాచారం చేశాడు. స్ప్రుహ వచ్చిన తరువాత ఒంటిపై బట్టలు లేకపోవడాన్ని బాలిక గమనించింది ఈ మేరకు దర్యాప్తు చేపట్టి ఈనెల 7వ తేదీన నిందితులను ముగ్గురిని రిమాండ్‌కు తరలించాం
2.వేణుగోపాల్ రెడ్డి ఆశ్రమానికి ఎలా పరిచయమయ్యాడు ఒక్క అమ్మాయి పైనేనా, ఇతర అమ్మాయిలపై అఘాయిత్యాలు వడగట్టాడా?
స: ఆ ఒక్క బాలిక పైన లైంగికదాడి చేశాడు వేణుగోపాల్ రెడ్డి ఫార్మా పరిశ్రమలో టెక్నీషియన్‌గా పని చేస్తూ వృద్ధులకు అనాథలకు సేవ చేసే ధోరణితో ఈ ఆశ్రమానికి పరిచయమయ్యాడు. అదే ముసుగులో ఈ ఘటన జరిగింది.
3. ఈ ఘటన ఆశ్రమ నిర్వాహకులకు తెలిసి జరిగిందా లేక వేణుగోపాల్ రెడ్డి ఒక్కడే లైంగిక దాడికి పాల్పడ్డాడా ఇంకా ఎవరికైనా ఇందులో ప్రమేయం ఉందా?
స. వేణుగోపాల్ రెడ్డి ఒక్కడే లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక వాంగ్మూలం ఇచ్చింది. ఆశ్రమ నిర్వాహకులు సహకరించారని తెలిపింది. మత్తుమందిచ్చి అఘాయిత్యానికి ఒడిగట్టాడు అని వాంగ్మూలం ఇచ్చింది.