'అక్షయ పాత్ర' లక్షలాది మంది ఆకలి తీర్చుతోందని హైకోర్టు న్యాయమూర్తి అభినంద్ కుమార్ షావలి ప్రశంసించారు. సంగారెడ్డి శివారులో నిర్మించిన అక్షయ పాత్ర మెగా హైటెక్ కిచెన్ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మనిషి ఆకలి తీరిన తర్వాతే ఇతర అంశాల గురించి ఆలోచిస్తాడని న్యాయమూర్తి అన్నారు. అక్షయ పాత్ర అవలంభిస్తున్న విధానాలను ఇతర సంస్థలు అనుసరించాలని ఆయన సూచించారు. వంటశాలలో పర్యటించి.. లక్షలాది మందికి ఒకేసారి భోజనం వండే విధానాన్ని న్యాయమూర్తి పరిశీలించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
'అక్షయ పాత్ర సేవలు అభినందనీయం' - undefined
సంగారెడ్డి శివారులో నిర్మించిన అక్షయ పాత్ర మెగా కిచెన్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి అభినంద్ కుమార్ పాల్గొన్నారు.
'అక్షయ పాత్ర సేవలు అభినందనీయం'