లాక్‌డౌన్ సమయంలో వచ్చిన అధిక విద్యుత్ బిల్లులను ఉపసంహరించుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్- బీదర్ జాతీయ రహదారిపై రాస్తారోకో, బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు.
'అధిక విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి'
లాక్‌డౌన్ సమయంలోని విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బీదర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
'లాక్‌డౌన్ కాల విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి'
నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం పేద ప్రజలపై మూడింత విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడం సరైనది కాదంటూ నారాయణఖేడ్ కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బిల్లులను రద్దుచేయాలని డిమాండు చేశారు.
ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్