విషాదంలో విషాదం: మృతదేహాన్ని తరలిస్తున్న వాహనం బోల్తా - accident news
కోల్‌కతా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రలోని షోలాపూర్‌కు మృతదేహాన్ని తరలిస్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని బూర్దిపాడు కూడలిలో జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా మృతుని సోదరునికి స్వల్ప గాయాలయ్యాయి.
accident to dead body transporting vehicle in jaheerabad
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని తరలిస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. కోల్‌కతా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రలోని షోలాపూర్‌కు మృతదేహాన్ని తరలిస్తున్నారు. ఈ క్రమంలో బూర్దిపాడు కూడలిలో డివైడర్‌ను ఢీకొన్న బొలెరో వాహనం బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు మృతుడి సోదరునికి స్వల్ప గాయాలయ్యాయి. వాహనానికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన బాధితులు తిరిగి సోలాపూర్‌కు పయనమయ్యారు.