తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నను చంపిన తమ్ముడు - police

మద్యం మత్తులో అన్నను హత్యచేసి తమ్ముడు పరారైన ఘటన సంగారెడ్డి పట్టణం శాంతినగర్​ కాలనీలో చోటుచేసుకుంది.

సంగారెడ్డి పోలీస్​స్టేషన్​

By

Published : Feb 21, 2019, 4:41 PM IST

అన్నను హతమార్చిన తమ్ముడు
సంగారెడ్డి పట్టణంలో అర్ధరాత్రి దారుణం జరిగింది. అన్నదమ్ముల మధ్య ప్రారంభమైన గొడవ చివరికి అన్న హత్యకు దారితీసింది. శ్యామ్​కుమార్​, నందకుమార్​లు సోదరులు. చాలాకాలంగా శాంతినగర్​లో ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు​. రోజూ మద్యం తాగి తనను, సోదరిని దూషిస్తున్నాడని తమ్ముడు నందకుమార్​ అన్నపై ద్వేషం పెంచుకున్నాడు. నిన్న అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న శ్యామ్​కుమార్​ను, నందకుమార్ బండరాయితో కొట్టి హతమార్చినట్లు సీఐ వెంకటేష్​ తెలిపారు.

నిందితుడు పరారీలో ఉన్నాడని.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details