సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామ కూడలిలో రోడ్డుప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన రెహనిద్దీన్(9) దౌల్తాబాద్ నుంచి వస్తున్న మేనత్త వద్ద సంచి తీసుకుందామని ప్రధాన రహదారి దాడుతుండగా అటుగా వేగంగా వెళ్తోన్న ఇన్నోవా కారు ఢీ కొట్టింది. దీనితో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హుటాహుటిన రామచంద్రపురంలో మైత్రి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
కారు ఢీకొని 9 ఏళ్ల చిన్నారి దుర్మరణం - సంగారెడ్డి జిల్లా నేర వార్తలు తాజా
రహదారి దాటుతుండగా ఓ 9ఏళ్ల బాలుడిని వేగంగా వెళ్తున్న కారు ఢీ కొట్టింది. దీనితో ఆ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పెదకంజర్ల గ్రామం కూడలిలో చోటుచేసుకుంది.
కారు ఢీ కొని 9 ఏళ్ల చిన్నారి దుర్మరణం
ఆడుతూ, పాడుతూ రోజంతా సరదాగా ఉండే తన చిన్నారి మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్ష నిమిత్తం తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'