సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లెపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ సభ్యులు ప్రతి ఇంటికి 12 రకాల కూరగాయలను పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లటానికి అసౌకర్యంగా ప్రమాదకరంగానూ ఉన్నందున గ్రామంలోని కొంత మంది నాయకులు స్వచ్ఛందంగా ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కరోనా వైరస్ పట్ల గ్రామ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని... ఏదైనా సమస్య ఉంటే తమ సాయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఇంటింటికి 12 రకాల కూరగాయల పంపిణీ - గ్రామ పంచాయతీ
సంగారెడ్డి జిల్లా మల్లెపల్లి గ్రామంలోని ప్రతి ఇంటికీ 12 రకాల కూరగాయలను పంపిణీ చేస్తూ గ్రామపంచాయతీ సభ్యులు దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఏదైనా ఇబ్బంది ఉంటే తమను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇంటింటికి 12 రకాల కూరగాయల పంపిణీ