తెలంగాణ

telangana

ETV Bharat / state

'12 కుటుంబాలను హోం క్వారంటైన్​ చేశాం' - corona cases in state

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారిని ఈనెల 28 వరకు క్వారంటైన్ చేసినట్లు స్పష్టం చేశారు నారాయణఖేడ్ డీఎస్పీ సత్యనారాయణ రాజు.

'12 కుటుంబాలను హోం క్వారంటైన్​ చేశాం'
'12 కుటుంబాలను హోం క్వారంటైన్​ చేశాం'

By

Published : Apr 11, 2020, 12:50 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 12 కుటుంబాలను హోం క్వారంటైన్​లో ఉంచామని నారాయణఖేడ్ డీఎస్పీ సత్యనారాయణ రాజు తెలిపారు. జహీరాబాద్​లో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో వీరు సన్నిహితంగా మెలిగినట్లు చెప్పారు. పట్టణంలోని రెండు కుటుంబాలతో పాటు నాగలిగిద్ద మండలంలోని దామరగిద్ద, సిర్గాపూర్ తదితర గ్రామాలకు చెందిన 12 కుటుంబాలను ఈనెల 28 వరకు క్వారంటైన్ చేసినట్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details