కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో స్వచ్ఛంద లాక్డౌన్ నిర్వహిస్తున్నారు. నేటి నుంచి పది రోజుల పాటు వ్యాపార, వాణిజ్య సంస్థలు సహా నిత్యవసర దుకాణాలను సైతం పూర్తిగా మూసి వేసేందుకు వ్యాపారుల సమాఖ్య ప్రతినిధులు నిర్ణయించారు.
కరోనా కట్టడికి.. ఆ పట్టణంలో 10 రోజుల స్వచ్ఛంద లాక్డౌన్.. - Sangareddy District news
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు సంగారెడ్డి జిల్లా జహిరాాబాద్ వాసులు స్వచ్ఛంద లాక్డౌన్ నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 10రోజుల వరకు అన్ని దుకాణాలు మూసివేసేందుకు నిర్ణయించారు.
కరోనా కట్టడికి.. ఆ పట్టణంలో 10 రోజుల స్వచ్ఛంద లాక్డౌన్..
స్వచ్ఛంద లాక్డౌన్తో జహీరాబాద్లో దుకాణాలు మూతపడ్డాయి. పట్టణంలో ప్రధానమైన భవాని మందిర్ కూడలి, బ్లాక్రోడ్, ప్రధాన రోడ్డు నిర్మానుష్యంగా మారింది. పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న లాక్డౌన్కు సహకరించాలని మున్సిపల్, పోలీసు అధికారులు ప్రజలకు సూచనలు చేస్తూ.. గస్తీ నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు లేక... వెలవెలబోతోంది.
ఇదీ చదవండి: గాలి ద్వారా కరోనా.. అడ్డుకోవడం ఎలా?