తెలంగాణ

telangana

ETV Bharat / state

YS Sharmila Padayatra: మూడో రోజుకు చేరుకున్న వైఎస్​ షర్మిల పాదయాత్ర - రంగారెడ్డి జిల్లా వార్తలు

రాష్ట్రంలో ఇంగ్లీష్​ మీడియంకు దిక్కు లేదు గాని... ఇంగ్లీష్​ మందు మాత్రం ఎక్కడపడితే అక్కడ దొరుకుతోందని వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో నీటికన్నా... మద్యం ఏరులై పారుతుందని ధ్వజమెత్తారు. ప్రజలు ఆదరిస్తే వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తాని హామీనిచ్చారు.

YS Sharmila
YS Sharmila

By

Published : Oct 22, 2021, 7:07 AM IST

రాష్ట్రంలో మంచినీటికన్నా... మద్యం ఏరులై పారుతోందని వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. రెండో రోజు 12.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తిచేశారు. నక్కలపల్లి నుంచి కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్, కవ్వడిగూడ, మల్కాపురం గ్రామాల మీదుగా షర్మిల పాదయాత్ర కొనసాగింది. నేడు మూడోరోజు పాదయాత్ర ఉదయం తొమ్మిదిన్నరకు కాచారం క్రాస్ రోడ్ నుంచి ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఊట్ పల్లిలోని ఒయాసిస్ పాఠశాల సమీపంలో భోజనం చేసి విరామం తీసుకోనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ఊట్ పల్లి నుంచి రాళ్లగూడ గ్రామం, శంషాబాద్ టౌన్ మీదుగా సాయంత్రం 6 గంటలకు పోశెట్టిగూడ గ్రామానికి చేరుకుని అక్కడే రాత్రి బసచేస్తారు.

మొదట సాగిందిలా..

మొదటిరోజు మొన్న మధ్యాహ్నం చేవేళ్ల మండలంలోని శంకర్​పల్లి క్రాస్​రోడ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభ అనంతరం వైఎస్ షర్మిల పాదయాత్రను విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. వైఎస్ షర్మిల రెండున్నర కిలోమీటర్లు నడిచి.. షాబాద్ క్రాస్​రోడ్​కు చేరుకున్నారు. అక్కడ వైఎస్సార్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న కందవాడ గేట్ క్రాస్​రోడ్డు వద్దకు పాదయాత్రగా చేరుకున్నారు.

అక్కడ మధ్యాన భోజనం చేశారు. గంట విరామం తర్వాత కందవాడ గేట్ క్రాస్ నుంచి పాదయాత్ర కొనసాగించారు. 6.5 కిలోమీటర్లు ప్రయాణించి కందవాడ గ్రామానికి, అక్కడి నుంచి గుండాల్ క్రాస్​కు చేరుకున్నారు. అక్కడి నుంచి నారాయణగూడా క్రాస్​రోడ్డుకు చేరుకున్నారు. తొలి రోజు మొత్తం 10 కిలోమీటర్ల వరకు వైఎస్ షర్మిల పాదయాత్ర పూర్తిచేశారు. మొదటిరోజు నక్కలపల్లి సమీపంలో రాత్రి బస చేశారు.

ఇదీ చదవండి:Huzurabad by election: రంగంలోకి సీఎం కేసీఆర్​.. రెండు రోజుల పాటు రోడ్​షోలు..!

ABOUT THE AUTHOR

...view details