ప్రేమికుల రోజుకు ఒక రోజు ముందే ఓ యువకుడు తనువు చాలించాడు. ప్రేయసి తనకు దక్కదనే మనస్తాపంతో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ప్రేయసికి పెళ్లి.. రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య - rangareddy crime news
రంగారెడ్డి జిల్లాలో ఓ ప్రేమికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ప్రేయసికి వేరే వ్యక్తితో వివాహం జరుగుతుండడం వల్ల మనస్తాపానికి గురై షాద్నగర్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రేయసికి పెళ్లి.. రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
కొందుర్గ్కు చెందిన విజయ్ ఓ చాక్లెట్ పరిశ్రమలో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. గురువారం.. విజయ్ ప్రేమించిన యువతి పెళ్లి వేరే వ్యక్తితో జరుగుతుండం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం కూడా పనికి వెళ్లకుండా షాద్నగర్లోనే విజయ్ గడిపినట్లు తల్లిదండ్రులు తెలిపారు. మృతుడు తండ్రి కృష్ణయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.