తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటి సంర‌క్షించే బాధ్య‌త‌ తీసుకోవాలి' - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

Shloka International School: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని ఘనంగా నిర్వహించారు. శ్లోక ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దోసపాటి రాము పాల్గొన్నారు. అనంతరం పాఠశాల యాజమాన్యంతో కలిసి ఆయన మొక్కలు నాటారు.

Dosapati Ramu planted plants
మొక్కలు నాటిన దోసపాటి రాము

By

Published : Apr 25, 2022, 12:46 PM IST

Updated : Apr 25, 2022, 1:53 PM IST

Shloka International School: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని ఘనంగా నిర్వహించారు. శ్లోక ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్​లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దోసపాటి రాము పాల్గొన్నారు. అనంతర పాఠశాల యాజమాన్యంతో కలిసి ఆయన మొక్కలు నాటారు.

నేటిత‌రం పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు ఇవ్వ‌ద‌గిన‌ది మంచి వాతావ‌ర‌ణమని సామాజిక కార్యకర్త దోసపాటి రాము పేర్కొన్నారు. ప్ర‌కృతితో మెల‌గాల్సిన విధానం, స‌మాజం ప‌ట్ల స‌రైన అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌ం పిల్ల‌లకు చిన్న‌త‌నం నుంచే నేర్పించాలని సూచించారు. ప‌ర్యావ‌ర‌ణ హితం కోసం ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటి సంర‌క్షించే బాధ్య‌త‌ తీసుకోవాల‌న్నారు.

అలాగే శ్లోక ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో విద్య‌ను బోధిస్తుండ‌టం శుభ‌ప‌రిణామ‌మ‌ని తెలిపారు. ఇది విద్యార్థుల‌కు ఎంతో ఉప‌యుక్త‌మ‌ని, ఆధునిక సాంకేతిక‌త‌తో కూడిన విద్యావిధానం బాగుంద‌ని అభినందించారు. అనంత‌రం పాఠశాల ఆవరణలో నూత‌నంగా నిర్మించిన కేంబ్రిడ్జ్ బ్లాక్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. ఈ కార్య‌క్ర‌మంలో శ్లోక్ స్కూల్స్ ఎండీ సంగ‌మేశ్వ‌ర గుప్తా, ఛైర్మ‌న్ బిట్ల శ్రీ‌నివాస‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

"మనం ప్రకృతిని ప్రేమించాలి. మనం మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని సంరక్షించవచ్చు. నేటిత‌రం పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు ఇవ్వ‌ద‌గిన‌ది మంచి వాతావ‌ర‌ణం. స‌మాజం ప‌ట్ల అందరూ అవ‌గాహ‌న అల‌వ‌ర్చుకోవాలి. పిల్లలకు ప్ర‌కృతితో మెల‌గాల్సిన విధానం. స‌మాజం ప‌ట్ల స‌రైన అవ‌గాహ‌న క‌ల్పించాలి. శ్లోక ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన విద్య‌ను బోధిస్తుండ‌టం శుభ‌ప‌రిణామ‌ం."

- దోసపాటి రాము సామాజిక కార్యకర్త

శ్లోక ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌

ఇదీ చదవండి:భాగ్యనగరంలో కూరగాయల ధరలు ఇలా..!!

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

Last Updated : Apr 25, 2022, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details