వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి.. బంధువుల ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో చోటుచేసుకుంది. ఆగ్రహించిన మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన చింతకింది మంజుల అనారోగ్యంతో బుధవారం రాత్రి మండలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు బాధితురాలికి అవసరమైన చికిత్స అందించకపోవడం వల్ల రాత్రి 2 గంటల సమయంలో మంజుల మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మంజుల మరణించిందని ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతురాలి భర్త కొన్నేళ్ల క్రితమే మరణించాడు. ఆమెకు ఇద్దరు కుమారులున్నారు. తల్లిదండ్రులు మరణించడం వల్ల పిల్లలు దిక్కులేని వారయ్యారని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మంజుల మృతికి కారణమైన వైద్యులను కఠినంగా శిక్షించి పిల్లలకు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : ప్రభుత్వాస్పత్రిలో బాలింత మృతి... బంధువుల ధర్నా..