Gun Firing Case: ఇబ్రహీంపట్నం కర్ణంగూడ వద్ద జరిగిన జంటహత్యల కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 25 ఎకరాలపై భూవివాదం ఏడాదిగా శ్రీనివాస్‌రెడ్డి, మట్టారెడ్డి మధ్య నడుస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 13న మట్టారెడ్డికి శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి మధ్య గొడవ జరిగింది. అప్పటికే మట్టారెడ్డిపై శ్రీనివాస్‌రెడ్డి నుంచి ఒత్తిడి పెరగడంతో తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన మట్టారెడ్డి వారి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. పథకం ప్రకారమే జంట హత్యలు చేయించినట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు.
భూవివాదంలో పోలీసు అధికారుల ప్రమేయంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం వ్యవహారంపై సీనియర్ అధికారి నేతృత్వంలో అంతర్గత విచారణ సాగుతోంది. ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ విజయ్, కానిస్టేబుల్ బాలకృష్ణను అంబర్‌పేట్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయి విచారణ నివేదిక ఆధారంగా సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
ఈనెల 1న కాల్పులు...