రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలో అధికారులు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు చీరలు అందజేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని ప్రశంసించారు. గ్రామంలో 30 రోజుల ప్రణాళిక పనులు ముమ్మరంగా సాగుతున్నందకు ఆయన హర్షం వ్యక్తం చేశారు.
'సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణే అగ్రగామి'
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొనియాడారు. రంగారెడ్డి జిల్లాలోని పోల్కంపల్లి గ్రామంలో బతకమ్మ చీరల పంపణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయి..లబ్ధిదారులకు చీరలను అందజేశారు.
మనలాంటి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడాలేవు