తెలంగాణ

telangana

ETV Bharat / state

22 లక్షల మంది కరెంటు బిల్లు కట్టలే! - users not paying current bill due to lockdown

లాక్‌డౌన్‌ ఆంక్షలున్నా కష్టకాలాన్ని అధిగమిస్తూ కరెంటు నిరంతరం సరఫరా చేస్తున్నా విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఆదాయం తగ్గుతోంది. గత నెలలో రాష్ట్రంలో 22 లక్షలమంది గృహవినియోగదారులు కరెంటు బిల్లు కట్టలేదు. దీనివల్ల నిర్ణీత ఆదాయంలో రూ.60 కోట్ల కోత పడినట్లు డిస్కంలు తాజాగా వెల్లడించాయి.

users not paying current bill due to lockdown
22 లక్షల మంది కరెంటు బిల్లు కట్టలే!

By

Published : Apr 13, 2020, 7:57 AM IST

లాక్‌డౌన్‌ ఆంక్షలున్నా కష్టకాలాన్ని అధిగమిస్తూ కరెంటు నిరంతరం సరఫరా చేస్తున్నా గత నెలలో రాష్ట్రంలో 22 లక్షలమంది గృహవినియోగదారులు కరెంటు బిల్లు కట్టలేదు. గతనెల బిల్లు కట్టని వారికి ఈ నెల బిల్లులో పాత బకాయి చేర్చి పంపించడం వల్ల ఎక్కువ బిల్లు వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. కానీ ఎవరికీ అదనంగా ఏమీ ఇవ్వలేదని డిస్కంలు స్పష్టం చేశాయి.

లాక్‌డౌన్‌ కారణంగా ఈ నెలలో మీటరు రీడింగ్‌ తీయకపోవడం వల్ల 2019 ఏప్రిల్‌లో ప్రతీ ఇంటికి వచ్చిన బిల్లు మొత్తాన్నే ఇప్పుడు మళ్లీ ఆన్‌లైన్‌లో డిస్కంలు పెట్టాయి. లాక్‌డౌన్‌ ముగిశాక వచ్చే నెలలో ఇంటింటికి తిరిగిమీటరు రీడింగ్‌తీస్తారు. ఆ రీడింగును నెలకో బిల్లు చొప్పున విభజిస్తారు. దీనివల్ల ఇప్పుడు కట్టిన సొమ్ముకన్నా తక్కువ రీడింగ్‌తో తక్కువ బిల్లు వస్తే ఆ సొమ్మును మరుసటి నెలలో సర్దుబాటు చేసేలా ఏర్పాట్లు చేశారు.

లాక్‌డౌన్‌ తక్కువ కాలమే ఉన్నా..

ప్రతీ నెలా కరెంటు బిల్లు సాధారణంగా 20వ తేదీలోగా చెల్లించాలనే గడువు ఉంది. కానీ గత నెల 23 తర్వాత లాక్‌డౌన్‌ వచ్చినా బిల్లు చెల్లింపులు బాగాతగ్గాయి. గతంలో ఎప్పుడూ 90 నుంచి 95శాతం వరకూ కరెంటు బిల్లుల చెల్లింపులుండేవి. రాష్ట్రంలో మొత్తం కోటీ 10 లక్షల గృహ వినియోగదారులుండగా వారిలో 20 శాతం మంది గత నెల బిల్లు కట్టలేదు. గతంలో ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లించేవారు 45 లక్షల మంది వరకుండగా గత నెల వారి శాతం 55కు పెరిగింది. ఈ నెలలో అది మరింత పెరుగుతుందని డిస్కంల అంచనా. కరోనా వ్యాప్తిని నివారించేందుకు విద్యుత్‌ సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందిస్తున్నామని, ఆన్‌లైన్‌లోనే బిల్లు పంపినందున అందులోనే చెల్లించాలని దక్షిణ డిస్కం సీఎండీ జి.రఘుమారెడ్డి సూచించారు. లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్ర విద్యుత్‌ డిమాండు బాగా తగ్గింది. ఆదివారం గరిష్ఠంగా 7,852 మెగావాట్లుంది. గతేడాది ఇదే రోజున (ఏప్రిల్‌ 12న) 8,842 మెగావాట్లుండటం గమనార్హం. రాత్రి సమయంలో రాష్ట్ర విద్యుత్‌ డిమాండు 6 వేల మెగావాట్లకు పడిపోతోంది.

ఇదీ చదవండీ... కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో దక్కని నిధులు

ABOUT THE AUTHOR

...view details