రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ అధ్యక్షుడు పాలకూర్ల జానయ్య గౌడ్ మాట్లాడుతూ... నిర్దేశించిన సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని సకాలంలో పూర్తిచేస్తామని చెప్పారు. సభ్యత్వ నమోదులో ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అగ్రభాగాన ఉంచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. క్రియాశీల సభ్యత్వ నమోదుకు రూ.100, ఎస్సీ, ఎస్టీలకు రూ.50, సాధారణ సభ్యత్వం అయితే రూ.30 చొప్పున వసూలు చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
లోయపల్లిలో తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం - లోయపల్లిలో తెరాస సభ్యత్వ నమోదు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఆదివారం మంచాల మండలం లోయపల్లి గ్రామంలో పార్టీ ముఖ్య నేతలు నమోదు ప్రక్రియను ప్రారంభించారు.
లోయపల్లిలో తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం
కార్యక్రమంలో మండల పార్టీ నాయకులతో పాటు విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు పాలకూర్ల వెంకటేశ్ గౌడ్, మాజీ సర్పంచి నారి యాదయ్య, మాజీ ఎంపీటీసీ ఉయ్యాల కృష్ణ, పగిల్ల గణేశ్, సదానందం, సేవ్యా, దశరథ్, ప్రకాశ్, నగేశ్, పరమేశ్ వెంకటేశ్ పాల్గొన్నారు.
ఇవీచూడండి:30 లక్షలు దాటిన తెరాస సభ్యత్వాలు