రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో తెరాస అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి.. పార్టీ అభ్యర్థులకు బీఫారమ్లు అందజేశారు. వీరంతా ఇంటింటి ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
ప్రచార జోరు పెంచిన గులాబీ అభ్యర్థులు - రంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలు
బీ ఫారమ్ అందుకున్న తెరాస అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
ప్రచార జోరు పెంచిన గులాబీ అభ్యర్థులు
మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిది వార్డుల్లో సమస్యలను తెలుసుకుంటూ ప్రచారాన్ని ముందుకు సాగించారు. సీఎం కేసీఆర్... ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.