రంగారెడ్డి జిల్లా నందిగామ సమీపంలోని నూజీవీడు పత్తి విత్తన పరిశ్రమ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ అనే యువకుడు తన ద్విచక్ర వాహనంపై కొత్తూరు వైపు వెళ్తుండగా హైదరాబాద్ వైపునుంచి షాద్నగర్ వస్తున్న ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి - నందిగామలో రోడ్డుప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ సమీపంలో ట్రావెల్ బస్సు, ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రంజిత్ కుమార్ అనే యువకుడు అక్కడిక్కడే మరణించాడు. యువకుడి మరణం వల్ల కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఈ ప్రమాదంలో రంజిత్ కుమార్కు తీవ్రగాయాలు కావటం వల్ల అక్కడికక్కడే మరణించాడు. వాహనాన్ని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు డ్రైవర్ ఆపకుండా ముందుకు వెళ్లిపోవటం వల్ల పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.