తెలంగాణ

telangana

ETV Bharat / state

తట్ట, పార చేతపట్టిన ట్రాఫిక్​ పోలీసులు - rachakonda

ట్రాఫిక్​ పోలీసంటే రోడ్డుపై నిలబడి వాహనాలను క్రమద్ధీకరించాలి. నిబంధనలు ఉల్లఘించిన వారికి జరిమానా వేయాలి. కానీ రంగారెడ్డి జిల్లా బాలాపూర్​లో గుంతల మయంగా మారిన రోడ్డును మట్టితో పూడుస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారు వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు.

పని చేస్తున్న పోలీసులు

By

Published : May 16, 2019, 6:49 PM IST

Updated : May 16, 2019, 7:35 PM IST

తట్ట, పార చేతపట్టిన ట్రాఫిక్​ పోలీసులు
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ కూడలిలో గుంతలమయంగా మారిన రోడ్డును వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు స్వయంగా పూడ్చివేశారు. రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు మట్టి తెప్పించి స్వయంగా తట్ట, పార చేతపట్టి గుంతలను పూడ్చివేశారు. దారిన వెళ్లే వాహనదారులు పోలీసులు చేసిన పనిని మెచ్చుకున్నారు.ఇందులో వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహించే ఎస్సై రంగారెడ్డి, ఏఎస్సై అశోక్, హెడ్ కానిస్టేబుల్ రాములు, హోంగార్డులు రాజు, లక్ష్మణాచారి పాల్గొన్నారు. ఇవీ చూడండి: మరో అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్​ ఆతిథ్యం
Last Updated : May 16, 2019, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details