ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్) నేతలు డిమాండ్ చేశారు. పీఆర్సీనీ తక్షణమే అమలు చేయాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
పీఆర్సీని వెంటనే అమలు చేయాలి : టీపీయూఎస్ - తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నిరసన
రాష్ట్రప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నేతలు ఆరోపించారు. పీఆర్సీనీ తక్షణమే అమలు చేయాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నిరసన
రాష్ట్రప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు రవి విమర్శించారు. వెంటనే 63 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీనీ అమలు చేసి, సర్వీస్ రూల్స్స్, ప్రమోషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.