తెలంగాణ

telangana

ETV Bharat / state

REVANTH: 'ఉడుకు రక్తానికి అనుభవం తోడు కావాల్సి ఉంది' - telangana varthalu

కేసీఆర్​ వ్యతిరేకుల పునరేకీకరణలో భాగంగా అందరినీ కలుస్తామని.. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ అన్నారు. దారితప్పిన రాష్ట్రాన్ని పట్టాలు ఎక్కించాలంటే... తమ ఉడుకు రక్తానికి అనుభవం తోడుకావాల్సి ఉందని పేర్కొన్నారు. మాజీ మంత్రి దేవేందర్​ గౌడ్​తో పాటు ఆయన కుమారులను రేవంత్​ కలిశారు.

REVANTH: 'ఉడుకు రక్తానికి అనుభవం తోడు కావాల్సి ఉంది'
REVANTH: 'ఉడుకు రక్తానికి అనుభవం తోడు కావాల్సి ఉంది'

By

Published : Jul 19, 2021, 9:41 AM IST

REVANTH: 'ఉడుకు రక్తానికి అనుభవం తోడు కావాల్సి ఉంది'

దారితప్పిన రాష్ట్రాన్ని పట్టాలు ఎక్కించాలంటే... తమ ఉడుకు రక్తానికి అనుభవం తోడుకావాల్సి ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని మాజీ మంత్రి దేవేందర్​ రెడ్డి నివాసానికి వెళ్లారు. దేవేందర్​ గౌడ్​తో పాటు ఆయన కుమారులు వీరేందర్​ గౌడ్​, విజయేందర్​గౌడ్​లతో చర్చించారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన దేవందర్‌ గౌడ్‌ ఆశీర్వాదం కోసమే... ఆయన ఇంటికి వచ్చినట్లు తెలిపారు. కేసీఆర్​ వ్యతిరేకుల పునరేకీకరణలో భాగంగా అందరినీ కలుస్తామని.. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలిస్తామని రేవంత్​ అన్నారు.

కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలనే ఆలోచన చేసింది దేవేందర్ గౌడ్‌నేనని.. దాన్ని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణలోని జలవనరులపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉందని... నీళ్ల కోసం రాష్ట్రం మొత్తం ఆయన పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. దేవేందర్​ గౌడ్​ నాడు పాదయాత్ర చేయడం వల్లనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి, దేవేందర్ గౌడ్ రాజకీయ విలువలకు ప్రతీకలని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయడం కోసం దేవేందర్‌గౌడ్‌ పనిచేశారని... రేవంత్‌రెడ్డి ప్రశంసించారు.

అందరి ఆలోచన ఒక్కటే..

కేసీఆర్​ వ్యతిరేకుల పునరేకీకరణలో భాగంగా అందరినీ కలుస్తాం.. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలిస్తాం. మా అందరి ఆలోచన ఒక్కటే... తెలంగాణ భవిష్యత్తు కోసం పనిచేస్తాం.-రేవంత్​ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇదీ చూడండి:'మోదీ అధికార దాహం.. ఆకలి కోరల్లో లక్షల మంది'

ABOUT THE AUTHOR

...view details