రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ స్వర్ణ భారత్ ట్రస్టులో కిమ్స్ ఆస్పత్రి సహకారంతో ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులకు వెళ్లే స్తోమత లేని వారి వద్దకే వైద్యాన్ని తీసుకురావడం ఆనందించాల్సిన విషయమని వెంకయ్య అన్నారు. వారంలో ఒకరోజు గ్రామీణ ప్రాంతాలకు, బస్తీలకు వెళ్లి వైద్యులు అక్కడి ప్రజలకు ముందస్తు చర్యలపై అవగాహన కల్పించాలని కోరారు. ప్రజల ఆహార అలవాట్లు మారాలని, దానితోపాటు శారీరక శ్రమచేస్తే రోగాలబారిన పడకుండా ఉంచొచ్చన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారే నిజమైన ధనవంతులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సౌందర రాజన్, కామినేని శ్రీనివాస్, కిమ్స్ డైరెక్టర్ డా.భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
సంపూర్ణ ఆరోగ్యం ఉన్న వారే నిజమైన ధనవంతులు: వెంకయ్య నాయుడు - venkayya naidu
అనారోగ్యం తెచ్చుకుని లక్షలు ఖర్చుపెట్టే బదులు.... ముందే జాగ్గత్త పడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ స్వర్ణ భారత్ ట్రస్టులో ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
స్వర్ణ భారతి ట్రస్ట్‌లో ఉచిత వైద్యశిబిరం