రాష్ట్రంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్ సోకిన లక్షణాలున్నాయనే అనుమానంతో ప్రజలకు నిర్ధరణ పరీక్షలు చేయించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కరోనా అనుమానితులతో కిటికిటలాడుతున్నాయి.
కరోనా నిర్ధరణ పరీక్ష కేంద్రాల వద్ద ప్రజల బారులు.. - ranga reddy district corona updates
రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్ అనుమానితులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పీహెచ్సీ కేంద్రాల వద్ద ఉదయం నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు బారులు తీరారు.
కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, లింగంపల్లి పీహెచ్సీ, హఫీజ్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద కరోనా నిర్ధరణ పరీక్షలు కోసం పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతుండటం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
40 ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలని, అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ విషయంలో అపోహలు నమ్మొద్దని చెప్పారు. ఏమైనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే పరీక్ష చేయించుకోవాలని, ఆలస్యం చేయకూడదని అన్నారు.
- ఇదీ చదవండి :వైద్య, ఆరోగ్యశాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు