Ibrahimpatnam incident రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి ఘటనపై పౌరహక్కుల సంఘం ప్రతినిధులు మండిపడ్డారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే మృతి చెందిన మహిళల భర్తలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. చిన్నపిల్లలు ఉన్నందున వారి చదువుకయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో నలుగురు మహిళలు మరణించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు రాజీనామా పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు పీఎం రాజు డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో ఈ నెల 25న 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. వీరిలో నలుగురు మహిళలు అస్వస్థతకు గురి కాగా.. వారిలో ఒకరు ఆదివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయారు. మరొకరు సోమవారం ఉదయం చనిపోయారు. పరిస్థితి విషమించిన లావణ్య, మౌనికలను ప్రైవేటు ఆసుపత్రులకు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 4కు చేరింది.
ఈ ఘటనపైవైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుస్పందించారు.ఇబ్రహీంపట్నం ఘటన దురదృష్టకరమని తెలిపారు. గంటగంటకు సమీక్షిస్తూ... బాధితులకు బాసటగా నిలుస్తున్నామని వివరించారు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందడం బాధాకరమన్నారు. ఘటనకు బాధ్యుడైన వైద్యుడి లైసెన్స్ రద్దు చేశామని, సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించి.. వారికి భరోసానిచ్చారు. ఇన్‌ఫెక్షన్ తగ్గిందని రెండు మూడు రోజుల్లో డిశార్చ్ చేస్తామని హరీశ్‌రావు స్పష్టంచేశారు. బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చామని.. డబుల్బెడ్రూం ఇళ్లు కూడా ఇస్తామని తెలిపారు.