తెలంగాణ

telangana

ETV Bharat / state

వింత వ్యాధితో చేప పిల్లలు మృతి

రంగారెడ్డి జిల్లా షాబాద్​ మండల కేంద్రంలోని పహిల్వాన్ చెరువులో గత వారం రోజులుగా వింత వ్యాధితో చేప పిల్లలు మరణిస్తున్నాయి. చెరువులో 3 లక్షల చేప పిల్లలుండగా ప్రస్తుతం సుమారు 50 వేల వరకు ఈ వ్యాధి కారణంగా మరణించాయని జాలర్లు వాపోయారు.

The fish died of a strange disease in rangareddy distrct in a pahilwan lake
వింత వ్యాధితో చేప పిల్లలు మృతి

By

Published : Jan 19, 2021, 8:04 PM IST

వింత వ్యాధి సోకి చెరువులోని వేలాది చేప పిల్లలు చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని పహిల్వాన్ చెరువులో జరిగింది. ఇక్కడ 3 లక్షల చేప పిల్లలుండగా అందులో సుమారు 50 వేల వరకు ఈ వ్యాధి కారణంగా మరణించాయని జాలర్లు వాపోయారు.

మత్స్యకార్మికులకు ఉపాధి కల్పించే ఆలోచనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పహిల్వాన్ చెరువులో లక్ష చేప పిల్లలను వదిలింది. వారం రోజులుగా అవి చనిపోతుండడంతో జాలర్లు వ్యాధి నిరోధక మందులను చెరువులో చల్లారు.

ఇదీ చదవండి:భారత ఆటగాళ్లకు కేసీఆర్​, కేటీఆర్​ అభినందన

ABOUT THE AUTHOR

...view details