తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలయ భూముల్లో ఆక్రమణలు తొలగింపు

దేవాలయ భూములను కబ్జా చేసి చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. ట్రైబ్యునల్​ తీర్పుతో రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లోని సీతారామచంద్ర ఆలయానికి సంబంధించిన భూముల విషయంలో చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ఆక్రమణలకు గురి కాకుండా సూచీలు ఏర్పాటు చేశారు.

ఆలయ భూములు

By

Published : Jul 17, 2019, 3:39 PM IST

ఆలయ భూముల్లో ఆక్రమణలు తొలగింపు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని సీతారామచంద్ర దేవాలయం భూముల్లోని అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. దేవాదాయశాఖ అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి వాటిని కూల్చేశారు. అమ్మపల్లి దేవాలయానికి సంబంధించి సమారు 200 ఎకరాల భూములుండగా వాటిని స్థానికులు సాగు చేసుకుంటా దేవాలయానికి పన్ను చెల్లిస్తున్నారు. అయితే సర్వే నంబర్​ 47లోని 33 ఎకరాలను స్థిరాస్తి వ్యాపారులు కబ్జా చేసి ప్లాట్లుగా విభజించి విక్రయించారు. దీనిపై దేవాలయ అధికారులు ట్రిబ్యునల్​లో కేసు వేశారు.

అక్రమ నిర్మాణాల కూల్చివేత

భూముల వ్యవహారంపై విచారణ జరిపిన ధర్మాసనం అవి అమ్మపల్లి దేవాలయానికి చెందినవిగా తీర్పిచ్చింది. ఈ తీర్పుతో అధికారులు స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. ఆక్రమణకు గురికాకుండా సూచిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు.
అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఔటర్‌ రింగ్​రోడ్డు సైతం సమీపంలో ఉండడం వల్ల లక్షల రూపాయలు పోసి ఇక్కడ ప్లాట్లను కొనుగోలు చేసిన కొందరు అయోమయానికి గురవుతున్నారు.

ఇదీ చూడండి : పరిశ్రమల వ్యర్థాలతో కాలుష్య కోరల్లో హైదరాబాద్ నీళ్లు

ABOUT THE AUTHOR

...view details