పెండింగ్లో ఉన్న పీఆర్సీ, రెండు డీఎలను విడుదల చేయాలంటూ రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ఉద్యోగుల ఐక్యవేదిక నాయకుల అరెస్టును నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన నిరాహారదీక్షకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీఆర్సీనీ వెంటనే ప్రకటించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక - రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన
పెండింగ్లో ఉన్న పీఆర్సీను వెంటనే ప్రకటించాలని ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన నిరాహారదీక్షకు అనుమతి ఇవ్వకపోవడంపై తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నాయకుల అరెస్టును నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఎన్నికల నెపంతో ప్రభుత్వం పీఆర్సీ వాయిదా వేస్తూ వచ్చిందని.. ఇప్పటికైనా ప్రకటించాలని ఆయన కోరారు. ఒకవైపు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా చెప్పుకుంటూనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పట్ల చిన్న చూపు చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తూ సంక్షేమ పథకాలను చేరవేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరు సరికాదన్నారు. కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు వారి స్వప్రయోజనాల కోసం ఉద్యోగుల జీవితాలను తాకట్టు పెడుతున్నారని పురుషోత్తం ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.