తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాను తట్టుకుని అగ్రస్థానంలో తెలంగాణ వ్యవసాయ రంగం

తెలంగాణలో వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులుతో కలిసి రంగారెడ్డి జిల్లా ఉప్పరిగూడలో గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

telangana agriculture sector  on number one position even in corona pandemic
కరోనాను తట్టుకుని అగ్రస్థానంలో తెలంగాణ వ్యవసాయ రంగం

By

Published : Aug 28, 2020, 6:34 PM IST

కరోనా సమయంలో అన్ని రంగాలు కుదేలయినా.. వ్యవసాయం రంగం మాత్రం అగ్రస్థానంలో ఉందని నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సీతారంపేట్​లో ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం నిర్మాణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. రైతుల కోసం నాబార్డు పని చేస్తుందని, వ్యవసాయం లేకుండా మానవ మనుగడే లేదని గోవిందరాజులు పేర్కొన్నారు. అన్నివర్గాల రైతులకు ఎల్లవేళల సాయం చేసేందుకు నాబార్డ్ కృషి చేస్తోందని తెలిపారు.

తెలంగాణలో వ్యవసాయ రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం పురపాలికలో గోదాములు ఏర్పాటు చేయడం మంచి పరిణామమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details