తెలంగాణ

telangana

ETV Bharat / state

'విద్యార్థులకు చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్​ అవసరం...' - వీఎన్ మార్ష‌ల్ ఆర్ట్స్ అకాడ‌మీ

చిన్నారుల మానసిక పరిపక్వతలో వ్యాయామం ఎంతో కీలకమైందన్నారు టైక్వాండో గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి. ఇటీవల నేపాల్​లో జరిగిన తైక్వాండో పోటీల్లో విజేతలైన విద్యార్థులను తుర్కయంజాల్​లో జరిగిన కార్యక్రమంలో సన్మానించారు.

Taekwondo winners
Taekwondo winners

By

Published : Jul 11, 2022, 3:29 PM IST

చిన్నారులు శారీర‌క‌, మాన‌సిక ధృఢ‌త్వం సాధించి, చ‌దువులోనూ విశేషంగా రాణించాల‌ని టైక్వాండో గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి అన్నారు. తుర్క‌యంజాల్‌లోని వీఎన్ మార్ష‌ల్ ఆర్ట్స్ అకాడ‌మీ నాల్గ‌వ వార్షికోత్స‌వంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య పాల్గొన్నారు. నేపాల్‌లో జ‌రిగిన తైక్వాండో పోటీల్లో మ‌న విద్యార్థులు బంగారు, రజితాలతో పాటు ఇత‌ర ప‌తకాలు సాధించ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని జయంత్ రెడ్డి సంతోశం వ్యక్తం చేశారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాల‌ని, ఆట‌ల‌తో పాటు, చ‌దువులోనూ ఉన్న‌త‌స్థానంలో ఉండాల‌ని డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య సూచించారు.

శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి, ఆత్మస్థైర్యానికి కరాటే ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ సంద‌ర్భంగా నేపాల్‌లో ప‌తకాలు సాధించిన విద్యార్థుల‌ను అతిథులు స‌న్మానించారు. కార్య‌క్ర‌మంలో కొంతం యాదిరెడ్డి, సంజయ్, వీఎన్ అకాడ‌మీ చైర్మ‌న్ నరేందర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details