రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లిలో దారుణం జరిగింది. ప్రేమ వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన చెరుకూరి మల్లేష్ రెండో కుమార్తె చెరుకూరి రుక్మిణి(2౦) హైదరాబాద్లో బీ ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన పవన్ కొంతకాలంగా ప్రేమపేరుతో ఆమె వెంటపడ్డాడు.
ప్రేమ వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్య - rangareddy
ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. ఎంత వారించినా నిత్యం వేధించేవాడు. కుటుంబ సభ్యులను తీసుకెళ్లి మందలించినా అతనిలో మార్పురాలేదు. చివరికి తనలో తానే మనో వేదనకు గురైన ఓయువతి చివరకు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది.
ఎవరికి చెప్పుకోవాలో తెలియక
తనకు ఇష్టం లేదని ఎన్నిసార్లు వారించినా అతని తీరుమారలేదు. తన వేదనను నానమ్మకు చెప్పుకుంది. నాన్నమ్మ వచ్చి తీరు మార్చుకొమ్మని పవన్ను మందలించినా అతనిలో మార్పురాలేదు సరికదా ఇంకా ఎక్కువయ్యాయి. విషయాన్ని తల్లికి చెబితే ఆమె కూతురినే మందలించింది. తన బాధను ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక నిత్యం తనలో తానే నరక యాతన అనుభవించి చివరికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
విద్యార్థిని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎదిగొచ్చిన కూతురు ప్రేమఘాతుకానికి బలైపోయిందంటూ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.