తెలంగాణ

telangana

ETV Bharat / state

Letter to CJI: విద్యార్థిని లేఖకు స్పందించిన సీజేఐ.. అధికారులకు ఆదేశం - జస్టిస్‌ ఎన్వీ రమణకు విద్యార్థిని లేఖ

స్కూలుకు వెళ్లేందుకు ఇబ్బంది అవుతోందని.. అందుకే తమ ఊరికి ఆర్టీసీ బస్సు సేవలు తిరిగి ప్రారంభించాలని ఓ విద్యార్థిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాసింది. దీనిపై స్పందించిన సీజేఐ... చిన్నారి కోరికను తీర్చారు. బస్సు సౌకర్యం కల్పించాలని రాష్ట్ర రవాణాశాఖను ఆదేశించారు.

student-letter-to-justice-nv-ramana
సీజేఐకి లేఖ రాసిన విద్యార్థిని

By

Published : Nov 5, 2021, 10:31 AM IST

Updated : Nov 5, 2021, 7:55 PM IST

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిదేడు గ్రామానికి… ఆర్టీసీ బస్సు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. పాఠశాల సమయంలో బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు విద్యార్థిని వైష్ణవి లేఖ రాసింది. కొవిడ్‌ కారణంగా తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోకలు నిలిచిపోయాయని… ఫలితంగా బడికి వెళ్లేందుకు ఇబ్బంది అవుతోందని ఆ విద్యార్థిని లేఖలో తెలిపింది.

సీజేఐకి లేఖ రాసిన విద్యార్థిని

ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు వాహనాలలో పాఠశాలకు వెళ్లడం కష్టంగా ఉందని వైష్ణవి లేఖలో పేర్కొంది. చిన్నారి లేఖపై స్పందించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖకు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ బస్సును పునః ప్రారంభించినట్లు ట్వీట్ చేశారు. ఇవాళ బస్సు సౌకర్యం కల్పించడంతో విద్యార్థులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

సీజేఐకి లేఖ రాసిన విద్యార్థిని

ఇదీ చూడండి:TSRTC: ఆర్టీసీ నంబర్‌తో ప్రైవేట్ బస్సు.. ఇన్ని రోజులు గుర్తించలేదా..?

Last Updated : Nov 5, 2021, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details