Blast at LB Nagar in Hyderabad : బండరాళ్లను తొలగించేందుకు ఓ నిర్మాణ సంస్థ పేలుళ్లు జరపడంతో స్థానికుల ఇళ్లు ధ్వంసమైన ఘటన రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌లోని కృష్ణనగర్ కాలనీలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన పేలుళ్లలో ఆ ప్రాంతంలోని పలు ఇళ్లపై బండరాళ్లు ఎగిరివచ్చి పడ్డాయి. దీంతో అద్దాలు, కిటికీలు ధ్వంసమయ్యాయి. అకస్మాత్తుగా భారీ పేలుడు శబ్ధాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగు
LB Nagar Blast news : గత కొంతకాలంగా ఓ నిర్మాణ సంస్థ బండరాళ్లు తొలిగించేందుకు పేలుల్లు జరుపుతోందని.. శుక్రవారం రాత్రి కూడా అలాగే చేసిందని స్థానికులు తెలిపారు. కానీ.. అకస్మాత్తుగా జరిగిన ఈ పేలుళ్లలతో బండరాళ్లు గాల్లోకి ఎగిరి తమ ఇళ్లపై వచ్చి పడ్డాయని చెప్పారు. అదృష్టవశాత్తు ఇళ్ల బయట ఎవరూ లేకపోవడం.. కిటికీలు, అద్దాలు పగిలిన ప్రాంతంలోనూ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఇళ్ల బయట ఉండి ఉంటే తీవ్రంగా గాయపడే వారమని ఆవేదన వ్యక్తం చేశారు.
LB Nagar Stone Blasting updates : ఈ పేలుళ్లపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి వేళ అసలు పేలుళ్లు ఎలా జరుపుతారని స్థానికులు ప్రశ్నించారు. ఆ సమయంలో బయట లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పిందని.. ఒకవేళ ఉంటే ఏమయ్యుండేదని నిలదీశారు. ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నిర్మాణ సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ ఇళ్లు ధ్వంసమైన కారణంగా పరిహారం ఇవ్వాలన్నారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై ఇంకా పోలీసులు స్పందించాల్సి ఉంది.
"గత మూడు నుంచి నాలుగు నెలలుగా ఇక్కడ ఓ ప్రైవేట్ కంపెనీ బిల్డర్స్ నిర్మాణం చేస్తున్నారు. అంతకుముందు మాములు శబ్దాలు వచ్చేవి. రాత్రి పదిన్నర ప్రాంతంలో ఒక్కసారిగా భారీ బ్లాస్టింగ్ చేశారు. పెద్ద శబ్దం వచ్చింది. దీంతో బండరాళ్లు గాల్లోకి ఎగిరి ఇళ్ల మీద వచ్చి పడ్డాయి. దీంతో మా ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. తలుపులు ధ్వంసమయ్యాయి. కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదు. రాత్రి వేళ పేలుళ్లు నిర్వహిస్తున్న నిర్మాణ సంస్థ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి ". - స్థానికులు
ఇవీ చదవండి: