రంగారెడ్డి జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. షాద్నగర్, కందుకూరు రెవెన్యూ డివిజన్లలోని 8 మండలాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. 94 ఎంపీటీసీ స్థానాలకు 313 మంది అభ్యర్థులు, 8 జడ్పీటీసీలకు 42 మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే 5 ఎంపీటీసీ స్థానాలు అధికార తెరాసకు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 2 లక్షల 49 వేల 149 మంది ఓటర్లు ఉండగా... అధికారులు 468 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. సమస్యాత్మకమైన 19 కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రంగారెడ్డిలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు సర్వం సిద్ధం
రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది మండలాల్లో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 468 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసిన ఈసీ 19 సమస్యాత్మక కేంద్రాల్లో బందోబస్తు పెంచారు.
రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు సర్వం సిద్ధం