తెలంగాణ

telangana

ETV Bharat / state

అంతర్వేది ఘటనకు చిలుకూరులో ధర్మ రక్షణ జ్యోతితో సంఘీభావం - చిలుకూరులో అంతర్వేది ఘటనపై జ్యోతితో సంఘీభావం

ఆంధ్రప్రదేశ్​లో అంతర్వేది రథం కాలిన ఘటనకు సంఘీభావంగా జనసేన అధిపతి పవన్​కల్యాణ్​ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయంలో ధర్మ రక్షణ జ్యోతిని ఆలయ అర్చకులు వెలిగించారు. అనంతరం నరసింహస్వామి స్తోత్ర పారాయణాన్ని జపించారు.

sanghibhavam with light at chilkur temple on antarwedi incident
అంతర్వేది ఘటనకు చిలుకూరులో ధర్మ రక్షణ జ్యోతితో సంఘీభావం

By

Published : Sep 11, 2020, 10:39 PM IST

ఏపీ అంతర్వేదిలో రథం దగ్ధమైన తర్వాత భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సనాతన ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో అందరూ దీపాన్ని వెలగించాలన్న జనసేనాధిపతి పవన్​కల్యాణ్​ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో సాయంత్రం దీపాన్ని వెలిగించి నరసింహస్వామి స్తోత్ర పారాయణాన్ని ఆలయ అర్చకులు జపించారు.

కొండపైనున్న ఆలయంలో కొలువున్న దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారాలు కల్పించాలని రాష్ట్రపతికి లేఖ రాయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారని ఆలయ అర్చకులు కొనియాడారు. రాష్ట్రపతికి పంపిన లేఖకు ప్రజాప్రతినిధులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, సామాజికవేత్తలు, దేవాలయ యాజమాన్యాలు విశేషంగా ఆమోదం తెలుపుతున్నారని ప్రధాన అర్చకులు రంగరాజన్​ తెలిపారు.

ఇదీ చదవండి:నూతన రెవెన్యూ చట్టం ఆరంభం మాత్రమే: కేసీఆర్‌

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details