రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబీకులు ఇంటింటికి కిరాణా సామగ్రి అందించారు. మంత్రి తల్లి ఆండాలమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. మంత్రి సతీమణి కావ్యారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆండాలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. లాక్ డౌన్ నేపథ్యంలో మంత్రి కిషన్ రెడ్డి గ్రామానికి రాలేకపోయారని మంత్రి సతీమణి స్పష్టం చేశారు.
నిత్యావసర సరకులు పంపిణీ చేసిన మంత్రి కిషన్ రెడ్డి కుటుంబీకులు - నిత్యావసర సరకులు పంపిణీ చేసిన మంత్రి కిషన్ రెడ్డి కుటుంబీకులు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తల్లి ఆండాలమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
కిరాణా సామగ్రి అందజేత