రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ ఇద్రీష్ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేశారు. వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని.. తెలిసిన వారిపనే అని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుని మెడపై బలమైన గాయాలు ఉన్నాయి. వేరే ప్రాంతంలో హత్యచేసి ఇక్కడ మృతదేహాని వదిలి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పహాడీషరీఫ్‌లో ఓ వ్యక్తి హత్య.. - పహాడీశేరీఫ్.
రంగారెడ్డి జిల్లాలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. వ్యాపార లావాదేవీలే కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పహాడీశేరీఫ్లో ఓ వ్యక్తి హత్య..