తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్యాక్స్​ ఛైర్​పర్సన్​ ఎన్నికలో తెరాసకు షాక్'​

తెలంగాణలో సహకార సంఘ అధ్యక్ష ఎన్నికల్లో రాష్ట్రమంతా తెరాస హవా ఉన్నప్పటికీ... రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలోని ముడిమ్యాల సొసైటీ ఛైర్​పర్సన్​గా​ కాంగ్రెస్​కు చెందిన గోన ప్రతాప్​రెడ్డి, గుండాల సొసైటీ అధ్యక్షుని​గా స్వతంత్ర అభ్యర్థి నక్క బుచ్చిరెడ్డిలు ఎన్నికయ్యారు. ఆదివారం వాయిదా పడ్డ ఎన్నికను గ్రామస్థుల ఆందోళనతో సోమవారం నిర్వహించారు.

PACS Chair Persons
PACS Chair Persons

By

Published : Feb 17, 2020, 11:12 PM IST

రంగారెడ్డి జిల్లా సహకార సంఘాల ఛైర్​పర్సన్​ ఎన్నికలో అధికార పార్టీ జోరుకు బ్రేకులు పడ్డాయి. జిల్లాలోని ముడిమ్యాల సహకార సంఘ అధ్యక్షునిగా కాంగ్రెస్​కు చెందిన గోన ప్రతాప్​రెడ్డి, గుండాల సొసైటీలో అధ్యక్షునిగా స్వతంత్ర అభ్యర్థి నక్క బుచ్చిరెడ్డిలు ఎన్నికయ్యారు. ఆదివారం ఈ ఎన్నికలు వాయిదా పడగా గ్రామస్థుల ఆందోళనతో సోమవారం తిరిగి నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ బలగాల మధ్య డైరెక్టర్లు ఓటింగ్ పద్ధతిలో ఛైర్మన్​లను ఎన్నుకున్నారు.

ముడిమ్యాల సొసైటీ ఎన్నికల్లో కాంగ్రెస్ 6, తెరాస 6, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట గెలిచారు. అధ్యక్షుని ఎన్నికకు స్వతంత్ర అభ్యర్థి మద్దతు ముఖ్యంగా మారినందున... అతన్ని తమవైపు తిప్పుకునేందుకు రెండు పార్టీల నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరికి ఓటింగ్​లో కాంగ్రెస్​కి చెందిన గోనె ప్రతాప్​రెడ్డికి ఏడు ఓట్లు రాగా ఆయనను ఛైర్మన్​గా, తెరాసకు చెందిన మల్లేశ్​ను వైస్​ఛైర్మన్​గా ఎన్నుకున్నారు.

ప్యాక్స్​ ఛైర్​పర్సన్​ ఎన్నికలో తెరాసకు షాక్

ఇవీ చూడండి:'ఆరోగ్య తెలంగాణే కేసీఆర్​ ధ్యేయం'

ABOUT THE AUTHOR

...view details