ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మున్సిపాలిటీలకు కేటాయించడం... తెరాస అభివృద్ధి పాలనకు నిదర్శనమని రంగారెడ్డి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వైస్ ఛైర్మన్ కొత్తకుర్మా సత్తయ్య అన్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీకి రూ. 7.77 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వీటితో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డులు, తాగునీరు పనులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతుల మీదుగా జనవరి 26న ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకే విపక్షాల విమర్శలు: సత్తయ్య - telangana news
ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మున్సిపాలిటీలకు కేటాయించడం... తెరాస అభివృద్ధి పాలనకు నిదర్శనమని రంగారెడ్డి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వైస్ ఛైర్మన్ కొత్తకుర్మా సత్తయ్య అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంతోనే ప్రగతి సాధ్యమని తెలిపారు. ఇప్పటికైన ప్రతిపక్షాలు అనవసరపు ఆరోపణలు మానుకుని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.
తెరాసతోనే అభివృద్ధి సాధ్యం : డీసీసీబీ వైస్‌ఛైర్మన్
కేసీఆర్‌తోనే ప్రగతి సాధ్యమని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టులా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా విపక్షాలు అనవసరపు ఆరోపణలు మానుకుని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.
ఇదీ చదవండి:భాషకు అందని 'మహానటి'.. సావిత్రి