ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. వయసుతో సంబంధం లేకుండా అందరికీ టీకా ఇవ్వాలని కోరారు. రోజూ కోటి వ్యాక్సిన్లు వేసేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఏఐసీసీ పిలుపుతో తాము ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి: కాంగ్రెస్ - తెలంగాణ వార్తలు
రాష్ట్రంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. వయసుతో సంబంధం లేకుండా టీకా ఇవ్వాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి చర్యలు చేపట్టాలని సూచించారు.
పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Corona : కరోనా దూరం చేసి కలవరపెట్టింది.. దగ్గరచేసి కలుపుతోంది