చుట్టూ కొండలు.. ప్రకృతి అందాల మధ్య రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు 8 కి.మీ.దూరంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రం రామేశ్వరం కొలువుతీరింది. ఏటా శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు, జాతర, స్వామివారి కల్యాణోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి.
ఇక్కడ వెలసిన శివలింగాన్ని వనవాస సమయంలో స్వయంగా శ్రీరామ చంద్రుడే ప్రతిష్ఠించాడని క్షేత్ర పురాణం చెబుతోంది. ఈ రామలింగేశ్వరుడిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే శివరాత్రి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు.