రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని ఉస్మాన్‌నగర్, వదిఏ జుబెన్ తదితర ప్రాంతాల వరద బాధితులకు జల్పల్లి మున్సిపల్ ఛైర్మన్ అబ్ధుల్లాహ్ సాది, కమిషనర్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఉస్మాన్ నగర్లో మున్సిపల్ ఛైర్మన్‌తో కలిసి తెరాస ఉపాధ్యక్షుడు యూసుఫ్ పటేల్ రూ.10 వేల సహాయాన్ని బాధితులకు అందించారు.
వరద బాధితులకు ఆర్థిక సహాయం అందజేత
రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వందల మంది బాధితులు లైన్లలో నిల్చుని తమ వివరాలను నమోదు చేయించుకుంటున్నారు.
flood
ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పొందడానికి ఉస్మాన్ నగర్లో వందల మంది వరద బాధితులు లైన్లలో నిల్చుని వారి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. జల్పల్లి తెరాస ఉపాధ్యక్షుడు యూసుఫ్ పటేల్ బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
Last Updated : Oct 23, 2020, 9:56 AM IST