ఆధ్మాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ముచ్చింతల్ భక్త జనసంద్రంగా మారింది. సమతా సూత్రాన్ని లోకానికి అందించిన మహానుభావుడు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో శనివారం సాయంత్రం కీలకఘట్టం ఆవిష్కృతమైంది. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు. పంచలోహాలతో రూపొంది, కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది.
సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 ఆలయాల నిర్మాణం చేపట్టారు. సమతామూర్తి కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఎల్‌ఈడీ దీపాల కాంతుల్లో కేంద్రం, యాగశాలలు శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. ప్రత్యేకంగా బెంగళూరుతోపాటు విదేశాల నుంచి తెప్పించిన వందకు పైగా రకాల పుష్పాలతో కేంద్రాన్ని అందంగా అలంకరించారు. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో నిర్విహించిన విష్వక్సేనేష్టి యాగంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో ప్రధానికి.. చినజీయర్ స్వామి స్వర్ణకంకణం కట్టారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధాని ముచ్చింతల్ పర్యటన సాగిందిలా..