Police Case filed on Ibrahimpatnam Former MLA Kishan Reddy :ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, బెదిరింపుల కేసు నమోదైంది. కిషన్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఆమోయ్ కుమార్( Amoy Kumar), ఇబ్రహీంపట్నం మాజీ మున్సిపల్ కమిషనర్ ఎండీ యూసుఫ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Complaint Files on Ranga Reddy Former Collector : మున్సిపల్ ఛైర్‌పర్సన్ కప్పరి స్రవంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ (Municipal Chairperson) పోస్టు కోసం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రూ. 2.5 కోట్లు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బుడగ జంగాల కులానికి చెందని తాను మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎంపికైన దగ్గరి నుంచి కులం పేరుతో మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఆయన కుమారుడు వేధిస్తున్నారని మున్సిపల్ ఛైర్మన్ స్రవంతి ఫిర్యాదులో వివరించారు.
మాజీమంత్రి మల్లారెడ్డి అతని అనుచరులపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
Harassment Complaint on Ibrahimpatnam Former BRS MLA : మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం మాజీ మున్సిపల్ కమిషనర్ యూసఫ్, అప్పటి వైస్ ఛైర్మన్‌కు బాధ్యతలు అప్పగించేందుకు తనను నిత్యం లీవ్ పెట్టాలని బెదిరించారని స్రవంతి తెలిపారు. మాజీ కలెక్టర్ ఆమోయ్ కుమార్ సైతం తనను పిలిచి ఉన్నత కులం వారితో తక్కువ కులం వారు పెట్టుకోవద్దని అన్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. సెలవు పెట్టకపోతే తనను సస్పెండ్ చేస్తానని రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ బెదిరించారని ఆమె తెలిపారు.
Allegations Of Bribe on Manchireddy Kishan Reddy : మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్రవంతి ఫిర్యాదు మేరకు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఆమోయ్ కుమార్, ఇబ్రహీంపట్నం మాజీ మున్సిపల్ కమిషనర్ ఎండీ యూసఫ్‌పై ఎస్సీ ఎస్టీ 504, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. శాసన సభ ఎన్నికల ముందు మున్సిపల్ ఛైర్‌పర్సన్ కప్పరి స్రవంతి బీఆర్‌ఎస్(BRS) పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా ఆమె పార్టీ మారిన తర్వాత బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై బెదిరింపుల కేసు వేయడం గమనార్హం.
నేను భూకబ్జా చేయలేదు - నాకు అంత అవసరం లేదు : మాజీ మంత్రి మల్లారెడ్డి
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు