తమ పాఠశాలను సుందరంగా తీర్చిదిద్ది విద్యార్థులను ప్రతిభావంతులుగా మార్చడానికి నడుం కట్టారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని యంపీ పటేల్‌గూడ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు. లాక్‌డౌన్ తర్వాత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని రోజు విడిచి రోజు రమ్మన్నా వీరు మాత్రం రోజూ బడికి వచ్చి తరగతి గదులకు రంగులు వేయడంతో పాటు గోడలను జాతీయ నాయకులు, క్రీడాకారుల చిత్రాలు, సూక్తులు, సందేశాలతో తీర్చిదిద్దారు. ఇందుకోసం ఉపాధ్యాయులే తలా కొంత భరించారు.
గురువుల కుంచె.. సందేశం పంచె - telangana latest updates
తరగతి గదిలో పాఠాలు చెప్పడమే కాదు బడిని సుందరంగా తీర్చిదిద్దాలని ఆ ఉపాధ్యాయులు నడుం కట్టారు. వారి డబ్బుతోనే బడిని అందంగా ముస్తాబు చేస్తున్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్ తరగతుల్లో ఎప్పటికప్పుడు సందేహాలు నివృత్తి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
గురువుల కుంచె.. సందేశం పంచె
ఇదంతా చేస్తూనే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతుల్లో విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.