రంగారెడ్డి జిల్లా తలకొండపల్లికి చెందిన దుర్గాపురం పద్మ, పెంటయ్య కుమారుడు కాశిం(13) పుట్టుకతో మూగ. అతను ఆరేళ్ల క్రితం వెళ్లిపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చెల్లూరులో తిరుగుతున్న కాశీంను స్థానిక యువకులు సెల్ ఫోన్లో చిత్రీకరించి ' టిక్ టాక్ 'లో పోస్ట్ చేశారు.
తలకొండపల్లికి చెందిన యువకులు ఆ వీడియోను చూసి ఈ నెల 11న తల్లిదండ్రులకు చెప్పారు. కుమారుడి కోసం ఆతృతగా చల్లూరు వెళ్లిన వారికి నిరాశ ఎదురైంది. కాశీం మళ్లీ ఏటోవెళ్లిపోయాడని రాజపేట పోలీసులు సమాధానం ఇవ్వడం వల్ల పద్మమ్మ, పెంటయ్యకు నిరాశే మిగిలింది.